30 ఆగ, 2014

Baba by Madhubabu



షాడో పాస్ట్ లైఫ్ సిరిస్‌లో ఏడవ నవల ఇది.
కుంగ్ ఫూ విద్యాపీఠంలో తనకంటె ఎంతో సీనియర్ అయిన ఫ్యుజీశాన్‌ని అవమానించి, విద్యాపీఠపు నియమాలకు విరుద్ధంగా శిక్షను అనుభవించకుండా తప్పించుకుంటాడు షాడో.
అతని మీద ఎంతో అభిమానం వున్నా, చేసింది తప్పు గనుక శిక్షార్హుడే అని నిర్ణయించి దేశంలో వున్న కుంగ్ ఫూ వస్తాదు లందరికీ శ్రీముఖాలు పంపిస్తాడు విద్యా పీఠానికి ముప్పది రెండవ గురువైన బాజూ అకరక్ చింగ్‌లీ.
టకమారా అనబడే వస్తాదు చేతికి దొరికినట్లే దొరికి గంగారాంతో సహా ఒక నదిలో దూకేస్తాడు షాడో. పట్టు బడకుండా తప్పించుకుంటాడు.
ఇంతవరకూ జరిగిన కథ ‘బంజాయ్’ అనే నవలలో వివరించటం జరిగింది.
ఆ తరువాత ఏం జరిగింది, నదిలో దూకిన షాడో ఏమైనాడు, అతన్ని పట్టి బంధించమని విద్యాపీఠం పంపిన శ్రీముఖాలు ఏమై పొయాయో తెలుసుకునేందుకు ఈ నవల చదవండి

Download

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...