30 ఆగ, 2014

2 Miles to be Boarder by Madhubabu



బందిపోటు మహమ్మద్, షాడోల తొలి పరిచయం, వారి మైత్రికి నాందీ ప్రస్తావన జరిగినది ఈ పుస్తకంలోనే.
* * *
“చోర్! చోర్!! పకడో... పకడో...” అన్న అరుపులు వినబడసాగాయి.


“ఆగయా రే... షాడో ఆగయా... సేట్ టిమిటీలాల్ హవేలీ ఖతమ్ హోగయా...” అని కేకలుపెడుతూ పరిగెత్తుకు వచ్చారు నలుగురు పౌరులు.
గొల్లుమన్నారు లాల్ పట్టీ సెంటర్లో నిలబడివున్న జనం. రెండో ఆలోచన లేకుండా టిమిటీలాల్ ఇంటివైపు పరుగులు తీశారు.
వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో చుట్టూ చూశాడు జాన్ పీటర్స్.
ఆవేశం తప్ప ఆలోచనలేదు దియోదార్ పౌరులకు. సందుగొందుల్ని జాగ్రత్తగా కవర్ చేయటం మరిచిపోయి ఒకే చోటికి పోతున్నారు కట్టకట్టుకొని...
షాడోని గురించి తనకు తెలిసిన విషయాలన్నిటినీ మననం చేసుకుంటూ తూర్పుదిశగా అడుగులు వేశాడు జాన్ పీటర్స్. తన అదృష్టం బాగుంటే ఆ దిశలోనే దొరకాలి షాడో... అదృష్టం బాగోకపోతే_

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...